శంకర్.. విఠలాచార్యగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న చిత్రంలో, ఆ పాత్రల స్థాయికి తగ్గట్టుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రంలో ఆ కాలం లెజండరీ దర్శకుల పాత్రలనూ చూపించనున్నారు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం విఠాలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ శంకర్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్‌పై కొన్ని సన్నివేశాలూ చిత్రీకరించారట. మరో రెండు నెలల్లో చిత్రం టాకీపార్ట్ పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నాడు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాణీలపై చిత్రబృందం నమ్మకంతో ఉంది. చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.