జయప్రకాష్‌రెడ్డికి ఫాస్ లైఫ్‌టైమ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత 20 ఏళ్ళుగా సినీ, టీవీ, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రీసియేషన్ సొసైటీ (్ఫస్) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదీ ఫాస్ అక్కినేని 2018 అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫాస్ అధ్యక్షుడు కె ధర్మారావు కార్యక్రమ వివరాలు వెల్లడిస్తూ, ఆదివారం (సెప్టెంబర్ 30) సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఆడిటోరియం (నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కళామందిరం)లో అవార్డుల ప్రదానం నిర్వహిస్తున్నామన్నారు. సంస్థ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు ఫాస్ అక్కినేని 2018 లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డును క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, విలన్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి (జెపి)కి అందించనున్నట్టు వెల్లడించారు. ఫాస్ అక్కినేని 2018 ప్రతిభా పురస్కారాన్ని ప్రముఖ నటుడు సంపూర్ణేష్‌బాబుకు ప్రకటించారు. ప్రముఖ నటులు మాణిక్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించనున్నట్టు చెప్పారు.