అలాంటి కథ కాదిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయ్యూమ్, షాని సోలెమాన్, పృధ్వీరాజ్, తనిష్క్ తివారి, సమీర్, లోహిత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో గౌతమ్‌రాజ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ నటుడు ఆలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకంపై రామగౌతమ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ రాజ్‌కుమార్ చెప్పిన విశేషాలు.. ‘సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యం. దీనికోసం ప్రత్యక అధ్యయనాలేమీ చేయలేదు. ఎందుకంటే నిత్యం పేపర్‌లో ఇలాంటి వార్తలు చదువుతూనే ఉన్నాం. అలాంటి అంశాలను క్రోడీకరించిన కథతో తెరకెక్కించాం. ఇక టైటిల్ గురించి చెప్పాలంటే ఈ రోజు సమాజంలో ఏ పనీ సవ్యంగా జరగడంలేదు. ప్రతి విషయంలో దోపిడీ. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సినిమా మన పక్కింటి అబ్బాయి.. లేదా అమ్మాయి కథ కాదు. ఈ సినిమా విషయంలో కొత్తవాళ్లతోనే చేద్దామని అనుకున్నాం. కానీ, కొత్తవాళ్లయితే నటనలో పెయిన్ కనిపించదని భావించి హీరోగా ఖయ్యూమ్‌ని ఎంపిక చేశాం. అద్భుతంగా చేశాడు. ఇప్పటివరకు ఖయ్యూమ్‌ను ఇలా ఎవ్వరూ చూసి ఉండరు. ఇక హీరోయిన్ షానికి ఇది తొలి సినిమా. అసలే బోల్డ్ పాత్ర, కాబట్టి మొదటిసారి ఈ పాత్రలో కొత్త హీరోయిన్లు ఎవరూ నటించేందుకు ముందుకు రారు. కానీ షాని మాత్రం ఆ పాత్రలో బాగా చేసింది. తప్పకుండా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంటుంది. మిగతా పాత్రల్లో పృధ్వీ, సమీర్, లోహిత్ ఆకట్టుకుంటారు. ఈ సినిమాకు నేపథ్య సంగీం ముఖ్యం కాబట్టి శాండీ సంగీతం తీసుకున్నాం. నా గురించి చెప్పాలంటే మాది వైజాగ్.. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశా. తరువాత మల్టీమీడియా అనుభవం సంపాదించా. ఆ క్రమంలో హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాను. సాగర చంద్ర దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశా. నటుడు ఆలీ సపోర్టుతోనే ప్రాజెక్టుకు హైప్ వచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. చిత్రం అక్టోబర్ 4న విడుదలకానుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రం కొత్తవారితోనే ఉంటుంది’ అని వెల్లడించాడు.