గీతా ఆర్ట్స్‌లో నాగశౌర్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీత గోవిందం చిత్ర విజయంతోపాటు వందకోట్లకు పైనే వసూళ్లు రాబట్టిన ఉత్సాహంతో గీత ఆర్ట్స్ చిన్న సినిమాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యానర్‌లో హీరో నాగశౌర్యతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. నాగశౌర్య హీరోగా ఓ యువ దర్శకుడితో సినిమాకు ప్లాన్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందట. ఈమధ్యే నర్తనశాల సినిమాలో నటించిన శౌర్యకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. మంచి కమర్షియల్ హిట్‌ను అందుకోవాలన్న ఆశలు గీతా ఆర్ట్స్‌తో తీరుతుందేమో చూడాలి.