టైటిల్ తెచ్చిన తంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ యాత్రీ. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. టైటిల్ మార్చాలంటూ పలు హిందూ సంఘాలు యాగీ మొదలెట్టాయి. నిజానికి ఈ సినిమా లవ్ రాత్రి అనే టైటిల్ పెట్టారు. సినిమా దసరా, నవరాత్రుల నేపథ్యంలో కథ ఉంటుందట. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే ఈ నవరాత్రుల నేపథ్యంలో తీసిన సినిమాకు ‘లవ్ రాత్రి’ అనే టైటిల్ పెడతారా? అంటూ పెద్ద రాద్ధాంతమే జరిగింది. దాంతో సల్మాన్ ఈ సినిమా టైటిల్‌ని మార్చి లవ్ యాత్రిగా పెట్టాడు. అయినాసరే ఈ టైటిల్‌ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సల్మాన్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నారట. దాంతో సల్మాన్ సుప్రీంకోర్టును సంప్రదించారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును పరిశీలిస్తున్నారట. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మను హీరోగా పరిచయం చేస్తూ సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది.