వెంటాడే.. సువర్ణ సుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు సూర్య ఎన్‌ఎస్‌ఎన్ తెరమీదకు తెస్తున్నాడు. చరిత్ర.. భవిష్యత్‌ను వెంటాడుతోందన్న ఆసక్తికరమైన క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నారు. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎం లక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం -సాంకేతిక అద్భుతంగా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. కార్యక్రమంలో సాయికార్తీక్ మాట్లాడుతూ ‘సువర్ణసుందరి చిత్రం ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకుడు థ్రిల్లయ్యేలా దర్శకుడు సూర్య ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నా కెరీర్‌కు ఇది అత్యుత్తమ చిత్రం కానుంది. సినిమాలోని పాటలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన సాహో సార్వభౌమి పాట విడుదల చేస్తున్నాం. మ్యూజికల్‌గా, విజువల్‌గా ఉత్తమంగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నాడు.