క్రేజీ కేథరిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో పవన్ పాత్రను శింబూ చేస్తున్నాడు. తెలుగులో నదియా పోషించిన ‘సునంద’ (అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషించనున్నారు. అలాగే సమంత పాత్రలో మేఘా ఆకాశ్ నటించనుంది. ఇక ప్రణీత చేసిన పాత్రకోసం ఎవరిని తీసుకోవాలా? అని చిత్ర బృందం కొన్ని రోజులుగా వెతికింది. చివరికి ఈ పాత్ర కోసం కేథరిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇద్దరు అమ్మాయిలతో.. సరైనోడు... నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో కేథరిన్ తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే జయ జానకి నాయకలో కేథరిన్ స్పెషల్ సాంగ్‌లో డాన్స్ అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో రెండు, మలయాళంలో ఒక సినిమా ఉన్నాయి. తాజాగా అత్తారింటికి దారేది రీమేక్‌లో ఛాన్స్ అందుకున్న కేథరిన్‌కు ఈ సినిమా ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి!