ఫలించాలి.. ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభయ్ ప్రొడక్షన్స్ పతాకంపై విశాఖపట్నంలోని నూతన నటీనటులతో ధనుంజయ్, హృతిక సింగ్ హీరో హీరోయిన్‌గా దినేష్.పి దర్శకత్వంలో నిర్మించిన సినిమా ప్రయత్నం. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు దీక్షిత్ తెలియజేస్తూ- తన శిష్యుడైన ధనంజయ్ చేస్తున్న ప్రయత్నం విజయం సాధించాలని కోరుకున్నారు. సినిమాలో భాగమైన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలన్నారు. హీరో మరియు నిర్మాత ధనుంజయ్ మాట్లాడుతూ- చిన్ననాటినుండి సినిమాపై వుండే ప్రేమతోనే ఈ చిత్రం చేశానన్నారు. నటించాలనే కోరిక ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వైజాగ్ ప్రాంత కళాకారులకు ఈ చిత్రం ద్వారా అవకాశం కల్పించామన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ- సినీ రంగంలో నిలదొక్కుకోవాలని చాలామంది కలలు కంటారని అయితే ధనుంజయ్ అందరికంటే భిన్నంగా ఆలోచించి ప్రయత్నంతో వస్తున్నాడన్నారు. మూవీకి సంబంధించి ఏవైనా మెళకువలు కావాలంటే ఎప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హీరోయిన్ మాట్లాడుతూ తెలుగులో మొదటిసారి నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు.