పరువు హత్యల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంది క్రియేషన్స్ పతాకంపై రాఘవ్, కరోణ్య కత్రిన్‌ను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం బంగారి బాలరాజు. కెఎండి రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలు. కోటేంద్ర దుద్యాల దర్శకుడు. ఈనెల 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ -చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే చిన్నికృష్ణ-చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలానే చిత్రాన్ని చూసిన శ్రేయోభిలాషి ఒకరు ‘ఒకనెల ముందు వచ్చివుంటే మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అభిప్రాయపడ్డాడు అన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కెఎండి రఫి మాట్లాడుతూ కోటేంద్ర దుద్యాల మాకు చెప్పిన కథకంటే తెరపై మరింత బలంగా చూపించారు. యథార్ధ పరువు హత్యను సినిమాటిక్‌గా దర్శకుడు చూపించిన విధానం బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. మరో నిర్మాత రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. చిత్రంలో ప్రేమ, పరువు హత్యతోపాటు తల్లీ కొడుకుల సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.