సెలెబ్రేషన్స్ ఆఫ్ బ్యాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కీ మీడియా నిర్మిస్తున్న సినిమా ‘హుషారు’. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్‌తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని కీలక పాత్రధారులు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ‘నానానా’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన పాటను దిల్‌రాజు విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘బెక్కం వేణుగోపాల్ నా దగ్గరకు వచ్చి సినిమాను తీస్తున్నానని చెప్పగానే నేను నవ్వాను. ఏదో విషయం ఉంటే తప్ప సినిమాలు ఆడటం లేదని చెప్పాను. ‘ఎకానమీ బడ్జెట్‌లో తీస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు ‘సరే’నన్నా. ‘ఓ పాటను విడుదల చేస్తున్నా, రండి అని పిలిచాడు. వచ్చి చూశాను. పోస్టర్ మీద ‘నేను చెడు తప్ప ఏదీ వినను. నేను చెడు తప్ప ఏదీ మాట్లాడను’ అని క్యాప్షన్స్ ఉన్నాయి. నేను మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ వీళ్లేమో... నన్ను పిలిచి నానానా అనే పాటను విడుదల చేయమన్నారు. అయినా ఇప్పుడు ప్రేక్షకులు మంచీ, చెడు ఆలోచించడం లేదు. వాళ్లు ఎంటర్‌టైన్ అయ్యామా? లేదా? అనేదే చూస్తున్నారు. అంతేగానీ లిప్‌లాక్‌లు ఉన్నాయా? ఇంకోటున్నాయా? అనే పట్టింపులు ఉండటం లేదు. భవిష్యత్తులో వీళ్ల దారికే నేను రావాల్సి ఉంటుందేమో. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘మా లక్కీ మీడియాను ఏర్పాటు చేసిన తర్వాత తొమ్మిది సినిమాలు చేశాం. మా లాస్ట్ సినిమా ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. అంతకుముందు ‘సినిమా చూపిస్త మావ’ చేశా. దిల్‌రాజు తీసిన ‘నేను లోకల్’కి పనిచేశా. యూత్‌ఫుల్ సినిమా తీయాలనుకుంటున్నప్పుడు శ్రీహర్ష ఈ స్క్రిప్ట్ చెప్పాడు. కథ నచ్చింది. వెంటనే సినిమా మొదలెట్టాం. సినిమా మొత్తం రెడీ అయింది. నా టెక్నీషియన్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని ప్రెస్‌మీట్ పెట్టాం. మా దర్శకుడు శ్రీహర్ష కొందరు దర్శకుల దగ్గర పనిచేశారు. బాలీవుడ్‌లోనూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఈ సినిమా చాలాబాగా వచ్చింది. సంగీత దర్శకుడు రథన్‌కి అందాల రాక్షసి నుంచి నేను ఫ్యాన్. ఈ సినిమాకు మంచి ట్యూన్లు ఇచ్చారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత తను సంగీతం చేసిన సినిమా ఇది. చిన్న సినిమాకు చేస్తాడో లేదోనని అనుకున్నా. కానీ కథ నచ్చి వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. భాస్కరభట్ల ఎనిమిది నెలల క్రితం ఈ పాట రాశారు. ఈ పాటను విడుదల చేస్తున్నామని చెప్పగానే ‘లిరిక్స్‌ని అలాగే ఉంచారా? ఏమైనా మార్చారా?’ అని అడిగారు. ‘ఏమీ మార్చలేదని చెప్పాను’. తను ఇప్పుడు రావడం హ్యాపీ. ఈ కథకి కొత్త కుర్రాళ్లు సరిపోతారనుకున్నాం. తేజస్ ఇంతకుముందు ఉలవచారు బిర్యానీ, కేటుగాడు అని రెండు సినిమాలు చేశాడు. మిగిలిన వాళ్లందరూ కొత్తవారే. అయినా చాలాబాగా చేశారు. మా ఆఫీసులోనే సినిమా రిహార్సల్స్ చేసుకుని వెళ్లి షూటింగ్ చేశారు’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈరోజుల్లో లైఫ్‌కి గ్యారంటీ లేదు. ప్రతి సెకనూ హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మెమరీస్ తప్ప మనం జీవితంలో ఇంక వేటినీ పైకి తీసుకెళ్ళలేం అనే కానె్సప్ట్‌తో సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.