మోస్ట్‌వాంటెడ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దానికి పైగా సౌత్‌లో టాప్ హీరోయిన్. వంద కోట్ల క్లబ్ నాయకి. ఆమె ఖాతాలో ఓ అరడజను రికార్డులు. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు పెట్టింది పేరు.. ఇవి చాలవా నయన్‌ను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడానికి. ఇటీవలే నయన్ నటించిన ‘కోకో కోకిల’ (కోలమావు కోకిల) చిత్రం తమిళ, తెలుగు ఆడియన్స్‌నే కాదు, విమర్శకుల నుంచీ ప్రశంసలందుకుంది. ఆస్కార్ (ప్రాంతీయ) నామినేషన్ల కేటగిరీలోనూ పోటీపడింది. అందుకే ఈ సినిమా తర్వాత నయన్ నటించబోయే చిత్రం ఏమై ఉంటుందా? అని సినీ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. నయన్ నటిస్తున్న 63వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ప్రకటించారు. అదే ‘ఐరా’. తెలుగు, తమిళంలో క్రిస్మస్ కాన్కగా డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకి దర్శకుడు. కోటపాడి జె రాజేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేశారు. నయన్ ద్విపాత్రల్ని ఎలివేట్ చేస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తొలిసారి నయన్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కావడంతోనూ ఆసక్తి పెంచుతోంది. కెరీర్ ఆద్యంతం ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్న నయన్ మరోసారి ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నయన్‌ది తెలుపు నలుపు వేరియేషన్? మరోవైపు నయనతార ‘సైరా- నరసింహారెడ్డి’లాంటి మోస్ట్ అవైటెడ్ చిత్రంలోనూ నటిస్తోంది.