రకుల్.. శ్రీదేవైనవేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఫస్ట్‌లుక్‌లు విడుదలయ్యాయి. రకుల్‌ప్రీత్‌సింగ్ పుట్టినరోజు సందర్భంగా అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర పోషిస్తోన్న ఆమె ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అందగత్తె రకుల్ ఫస్ట్‌లుక్‌లో పోస్టర్‌లో అందంగా కనిపిస్తున్నా అతిలోక సుందరిని మ్యాచ్ చేయలేక పోవడం గమనార్హం. ఎన్టీఆర్ ‘వేటగాడు’ చిత్రంలోని సెనే్సషన్ సాంగ్‌లో శ్రీదేవి అప్పియరెన్స్‌తో రకుల్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. బాలయ్య, రకుల్‌ల మధ్య ‘ఆకుచాటు పిందే తడిచే’ పాటను రీమిక్స్ చేయనుండటం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’)గా రాబోతుంది కనుక, ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన కథానాయకుడి భాగంలోనే రకుల్ అట్రాక్షన్ కనిపించనుంది. కథానాయకుడి భాగం జనవరి 9న విడుదల చేయనున్నారు. సో, రీల్ శ్రీదేవి అల్లరి, ఎన్టీఆర్ మార్క్ బాలయ్య స్టెప్పులు చూసేందుకు రెడీ అవ్వొచ్చు.