అనర్థాలను చెప్పే ఇది నా సెల్ఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పించు శ్రీచరణ్ సెనే్సషనల్ మూవీ ఇది నా సెల్ఫీ. సిహెచ్ ప్రభాకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నువ్వుల వినోద్, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లు. శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించారు. చిత్రం ఆడియోను ఫిలిం ఛాంబర్‌లో ప్రముఖుల సమక్షంలో విడుదల చేసిన సందర్భంలో ఎన్ శంకర్ మాట్లాడుతూ దర్శకుడిగా, కథకుడిగా, నిర్మాతగా తీసుకున్న సెల్ఫీ పాటలు బావున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ మాలపాటి మాటలను పాటలతో, పాటలను మాటలతో చెప్పడం బావుంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలు చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
గీత రచయతను దేవిప్రసాద్ అభినందిస్తూ, చిత్రాన్ని పాషన్‌తో తీశారు, ఆదరించండి అని కోరారు. లైన్ సాయి వెంకట్ మాట్లాడుతూ ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. ఏ పని మొదలుపెట్టినా అందరూ ఉండాలని కోరుకునే వ్యక్తి ప్రభాకర్. ఇంకా చాలా సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నానన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఎస్‌విఎన్ రావు మాట్లాడుతూ ఈ చిత్రం నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ద్వారా విడుదలవడం సంతోషంగా ఉందన్నారు. వినోద్ మాట్లాడుతూ నన్ను హీరోగా గుర్తించి అవకాశమిచ్చిన ప్రభాకర్‌కి కృతజ్ఞతలు. టీంకి ఆల్ ది బెస్ట్ అన్నారు.
వీర్‌కరణ్ మాట్లాడుతూ చిత్రానికి మ్యూజిక్ అందించిన శ్రీనివాస్ మాలపాటి, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు, ప్రొడ్యూసర్ ప్రభాకర్ మాట్లాడుతూ నన్ను వెన్నుతట్టి ఇంతదూరం నడిపించిన కో ప్రొడ్యూసర్‌కి, డైనమిక్ టైగర్ నవ్యాంధ్ర చైర్మన్‌కి కృతజ్ఞలు తెలిపారు. ఇది నా సెల్ఫీ అనగానే అందమైన సెల్ఫీల గురించిన చిత్రం అనుకుంటారు. కానీ సెల్ఫీలవల్ల జరిగే అనర్థాలు, సెల్ఫీలవల్ల కొన్ని జ్ఞాపకాలను తీసుకొని చేసిన చిత్రమన్నారు. కష్టపడి పని చేసిన యూనిట్‌కు థాంక్స్ చెబుతూ, సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.