ఆగని మీ టూ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైంగిక వేధింపుల అకృత్యాల్లో సింగర్లూ పాత్రధారులే. బాలీవుడ్‌లో భట్టాచార్య, సౌత్‌లో సింగర్ కార్తీక్ లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కార్తీక్ వంకర చేష్టలకు తానూ బాధితురాలినేనంటూ గాయని చిన్మయి శ్రీపాద తాజా వ్యాఖ్య. తమిళ లిరిసిస్ట్ వైరాముత్తు వేధింపులపై గొంతుపెంచిన చిన్మయి, సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్న ఓ బాధితురాలిని ఓదారుస్తూ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కెరీర్‌పై భయంతో పేరు చెప్పలేకపోతున్నానని, సింగర్ కార్తీక్ నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఓ మహిళ వ్యక్తం చేసిన ఆవేదనను చిన్మయి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రయివేట్ షోలు, టూర్ల సమయంలో మహిళా సింగర్లతో కార్తీక్ చేష్టలు వికృతంగా ఉంటాయన్నది ఆమె ఆవేదన. ఆమెకు చిన్మయి మద్దతు తెలుపుతూ ‘కార్తీక్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళల వెంట పడటం అతని వ్యసనం. వికృత చిత్రాలు, అనుచిత సందేశాలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. అందులో నేనూ బాధితురాలినేనంటూ చిన్మయి షేర్ చేశారు.
సిగ్గుపడాలి..
లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ధైర్యం చేసి గొంతు విప్పుతున్న బాధిత మహిళలపై జోకులు వేసుకోడానికి సిగ్గుపడాలి’ అని సీనియర్ నటి ఖుష్బూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి మీ ఇంట్లోని అక్కతోనో, చెల్లెతోనో నిజాయితీగా మాట్లాడండి. డజన్లకొద్దీ ‘మీ టూ’ కథలు మీదృష్టికి వస్తాయి. వాటిపైనా జోకులేయగల ధైర్యముందా? అంటూ ప్రశ్నించారు. ఇంతకాలం ఏం చేశారు? ఇవన్నీ కట్టుకథలంటూ సోషల్ మీడియాలో వస్తోన్న జోకులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల మనసు ధ్వనిలో వొణుకు మీకు వినిపించడం లేదూ? అంటూ ప్రశ్నించారు. కట్టుకథలు ఎన్ని ఉన్నాయన్నది పక్కన పెడితే, లైంగిక వేదింపులు ఎదుర్కొన్నానంటూ ఎంతమంది మహిళలు చెబుతున్నారో అన్నింటినీ సీరియస్‌గా తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడరు. తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని, ఈ విషయం చెబుతూ మిమ్మల్ని నిరాశ పర్చినందుకు క్షమించండి అంటూ లైంగిక వేధింపులపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారికి చురకలు వేశారు.
అబద్ధాలూ ఉన్నాయేమో?
‘మీటూ’ ఉద్యమం పేరిట అబద్ధాలూ చోటుచేసుకుంటున్నాయన్న అనుమానాన్ని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే్న వ్యక్తం చేశారు. వస్తున్న అభియోగాల్లో కొన్ని యథార్థాలు ఉండే ఉండొచ్చు. అన్నీ నిజమని నమ్మలేని పరిస్థితి మాత్రం వచ్చింది. నేను విన్న కొన్నింటిలో నిజం లేదని నమ్ముతున్నా అంటూ వ్యాఖ్యానించారు. మీటూపై స్పందించే ఆసక్తి నాకు లేదంటూనే, అబద్ధాలూ నిజాలైపోతున్నాయి.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.