హన్సిక.. మేహ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య హీరోయిన్లు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలే చేస్తున్నారు. ఆ దిశగా కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, త్రిషలాంటి హీరోయిన్లు మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో గ్లామర్ భామ హన్సిక కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. తెలుగు తెరపై హీరోయిన్‌గా పరిచయమైనా ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌లోనే సెటిలైంది. తాజాగా హన్సిక ‘మేహ’ అనే టైటిల్‌తో తెరకెక్కే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. జమీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు హన్సికకు 50వ సినిమా. అందుకే వైవిధ్యమైన స్క్రిప్ట్‌ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా దసరాకు షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మేహ సినిమాతో హన్సిక ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.