..అంతా విచిత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘అంతా విచిత్రం’. చిత్రానికి జైరామ్‌కుమార్ దర్శకుడు. సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయ్ భాస్కర్ ముఖ్య తారాగణం. చిత్రానికి భోలే షావలి సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రానికి ఆడియో విడుదల ఘనంగా నిర్వహించారు. ఆడియో వేడుకలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయివెంకట్, ముళ్లగూరు అనంతరాముడు, చిత్ర నిర్మాత, అయాన్ ఆర్ట్స్ అధినేత మొహ్మద్ అస్లాం, దర్శకులు జైరామ్‌కుమార్, చిత్ర సమర్పకులు ఎర్రోజు వెంకటాచారి, సహ నిర్మాత జి శ్రీనుగౌడ్, సంగీత దర్శకులు భోలే షావలి, సాయిప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయభాస్కర్, ఎంజిఎం అధినేత ఎం అచ్చిబాబు పాల్గొన్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు అలీతో ‘తిన్నామా... పడుకున్నామా... తెల్లారిందా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన జైరామ్‌కుమార్ ‘అంతా విచిత్రం’ చిత్రాన్ని వినూత్నమైన కథాంశంతో తెరకెక్కించారని నిర్మాత మొహ్మద్ అస్లాం అన్నారు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫ్యాన్స్ అయి ఉండి, వాళ్ళను నిజ జీవితంలో అకరిస్తుండే కొందరు కుర్రాళ్ళ కథతో రూపొందిన చిత్రం కచ్చితంగా అందరి ఆదరణ పొందుతుందని దర్శకుడు జైరామ్‌కుమార్ అన్నారు. అంతా పిల్లలతో రూపొందిన చిత్రం మంచి విజయం సాధించాలని పలువురు ఆకాంక్షించారు.