డిసెంబర్ నుంచి భారతీయుడు-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంచగొండుల కుత్తుక తెగ్గోసి, తప్పుడువాళ్ల గుండెల్లో నిద్రపోయిన సేనాపతి గుర్తున్నాడా? అతనే -కమల్‌హాసన్, శంకర్‌ల కాంబోగా వచ్చిన భారతీయుడు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేయనుండటం తెలిసిందే. కమల్‌తో మొదలెట్టనున్న రెండో భారతీయుడు డిసెంబర్‌లో సెట్స్‌పైకి రానుందని సమాచారం. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన భారతీయుడు సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. రెండో భారతీయుడిని రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే పాత్ర మేకోవర్‌లో భాగంగా కమల్ కోసం అమెరికా నుంచి ఫిట్‌నెస్ ట్రైనర్ వచ్చాడట. డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరలో సినిమాను విడుదల చేయాలన్నది ప్రణాళిక. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బిజీగా ఉన్నప్పటికీ, భారతీయుడిపై మమకారంతో కమల్‌సాసన్ చిత్రంపై ఎక్కువ ఫోకస్ పెట్టాడని అంటున్నారు.