2 ఫ్రెండ్స్.. ట్రూ లవ్ సాంగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్లగూరు అనంతరాముడు, రమేష్ నాయుడు తెలుగు, కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టూ ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరో హీరోయిన్లు. శ్రీనివాస్ జిఎల్‌బి దర్శకుడు. ఈనెల 26న విడుదలవుతున్న చిత్రం ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. వేడుకలో శ్రీకాంత్, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, సి.కల్యాణ్, నారపురెడ్డి, నటి కవితలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తొలి చిత్రం (టూ ఫ్రెండ్స్) నిర్మాణంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అయితే సినిమా చాలా బాగా రావడంవల్ల వాటిని అనుభవ పాఠాలుగా తీసుకొని వదిలేశానని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని చిత్ర నిర్మాత అనంతరాముడు తెలిపారు. తెలుగుతోపాటు కన్నడలోనూ రూపొందిన చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో విడుదల చేశామని, అక్కడ మంచి వసూళ్లు సాధించడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. హీరో శ్రీకాంత్ వేడుకకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంతరాముడు సినిమా రంగంలోనూ అద్భుతాలు ఆవిష్కరించాలని అంబికా కృష్ణ ఆకాంక్షించారు. టూ ఫ్రెండ్స్ ట్రూ సక్సెస్ సాధించాలని అభిలషించారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ హీరో కార్తీక్ కోసం వేడుకకు వచ్చానని, హీరోగా అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణను టూ ఫ్రెండ్స్ చిత్ర బృందం ఘనంగా సత్కరించింది.