విన్నర్ గోపీచంద్‌తో పంతం గోపీచంద్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో కొనసాగుతున్న మాస్ హీరో గోపీచంద్‌కు ఇటీవల విడుదలైన ‘పంతం’ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా విడుదలై నాలుగు నెలలు కావస్తున్నా ఈ హీరో తన కొత్త చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విన్నర్, బలుపు చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించడానికి సన్నద్ధమవుతున్నాడట. శ్రీ బాలాజీ సినీ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడే అవకాశాలు వున్నాయి.