పెళ్లి హడావుడిలో కమెడియన్ రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చకున్న రాహుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పెళ్లి గురించి రాహులే స్వయంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఫన్నీగా పోస్ట్ చేశాడు. ‘నేను జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నాను. సీరియస్‌గా చెబుతున్నా. దయచేసి నా పెళ్లి గురించి ఎవరికీ చెప్పకండి’ అని.. బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు రాహుల్‌కు వరుసగా శుభకాంక్షలు తెలుపుతున్నారు.