ఒట్టు.. సవ్యసాచి హిట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కానె్సప్ట్ రాలేదు. ఏ దర్శకుడికైనా ఇలాంటి సబ్జెక్టుతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. వైవిధ్యమైన ఇలాంటి సబ్జెక్టు చేసే అవకాశం రాలేదన్న చిన్న పెయిన్ ఇప్పుడు తెలుస్తోంది అని సవ్యసాచి చిత్రం ట్రైలర్ లాంచ్‌లో దర్శకుడు సుకుమార్ అన్నాడు.
చైతూ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం -సవ్యసాచి. నిధి అగర్వాల్ హీరోయిన్. మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రానికి సంగీతం కీరవాణి. నవంబర్ 2న విడుదలకానున్న సినిమా ట్రైలర్ విడుదలను బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. చిత్ర సాంకేతిక నిపుణులు, నటీనటులు హాజరైన కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ మంచి సబ్జెక్టును డీల్ చేసే చాన్స్ చందు మొండేటికి రావడంపై జెలసీ ఫీలవుతున్నా అన్నారు.
‘నిజానికి నేను కార్తికేయ సినిమాను పెద్ద ఫ్యాన్. అంతకుమించి కార్తికేయను డీల్ చేశాడు చందు. ఇక కీరవాణి గురించి నా మిత్రుడు దేవీశ్రీ ప్రసాద్ గొప్పగా చెబుతుంటాడు. ఆయన మ్యూజిక్ జీనియస్. టీజర్, ట్రైలర్‌లో రీరికార్డింగ్ అద్భుతంగా చేశారు. ఇక పాటల బాణీలు చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి నిర్ణయమైనా ఫాస్ట్ తీసుకోగలిగే నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్. నవీన్ మేనేజ్‌మెంట్, మోహన్ కో-ఆర్డినేషన్, రవిశంకర్ ప్లానింగ్‌లో ఎక్స్‌పర్ట్స్. అందుకే వరుసగా వాళ్లనుంచి విజయవంతమైన చిత్రాలు వస్తున్నాయి. కెమెరామెన్ యువరాజ్ విజువల్స్ ఫెంటాస్టిక్‌గా చేశాడు. హండ్రెడ్ పర్సెంట్ లవ్ తరువాత చైతూ నేను రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. సమంత వచ్చాక ఈ మధ్య కలవడం లేదు. ట్రైలర్‌లో చాలా అందంగా, క్యూట్‌గా కనిపిస్తున్నాడు. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డిఫరెంట్స్ ఎక్స్‌పీరియన్స్ సినిమా. ఊహించని క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం. ఇన్ని గుడ్ క్వాలిటీస్‌తో వస్తున్న సవ్యసాచి డెఫినెట్‌గా హిట్ అన్నాడు సుకుమార్.
ఎంఎం కీరవాణి మాట్లాడుతూ అంకితభావం కలిగిన నిర్మాతలు చిత్రం నిర్మించారన్నారు. ఇప్పటికి తీసినవే కాదు, మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. చందుతో అనుబంధం బాగుంది, అతని నేచర్‌తోతో బాగా కనెక్టయ్యానని అన్నారు. ఈ జర్నీలో ఎన్నోసార్లు తిట్టా. కసురుకున్నా. అన్నీ మనమంచికే అన్నట్టు మళ్లీ రీఫ్రెష్ అయ్యేవాడు. చైతు అద్భుతంగా చేశాడు. నాగచైతన్య మాట్లాడుతూ కెరీర్‌లో ప్రేమమ్‌లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చందుతో సన్యసాచి చేయడం హాయిగా ఉంది. స్టోరీ చెప్పిన వెంటనే సినిమాకి ఓకే చెప్పేశా. కంటెంట్‌ను నమ్మి సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు. నైపుణ్యవంతులు పని చేసిన చిత్రమిది. మంచి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా ఫస్ట్‌లుక్, సాంగ్స్ రిలీజ్ తరువాత చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మంచి సంగీతమిచ్చిన కీరవాణికి కృతజ్ఞతలు. ఈనెల 27న ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుంది. నవంబర్ 2న సినిమా రిలీజ్ కాబోతుందని అన్నారు.