థగ్స్ ఆఫ్... కత్రినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో తాజా సెనే్సషన్ -్థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఇండస్ట్రీ దిగ్గజాలు అమితాబ్, అమీర్ ప్రధాన పాత్రలు చేస్తున్న చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకుడు. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్‌లు ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కత్రినా చేసిన ‘సురైయ్య’ సాంగ్ విడుదల చేస్తున్నామంటూ కొంతకాలంగా ఊరిస్తూ వస్తుండటం తెలిసిందే. ఫస్ట్‌లుక్‌లోనే హాట్ పోజుతో ఔరా అనిపించిన కత్రినా -ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ప్రోమోతో మరింత పల్స్ రేటు పెంచేసింది. అసలే నర్తకి పాత్ర కావడం, దానికితోడు ఈ పొడగరి బ్యూటీ డ్యాన్స్‌లో చూపించిన హావభావాలు, ఒంపుసొంపుల కదలికలతో ‘వావ్’ అనిపించింది. కత్రినా, అమీర్‌పై చిత్రీకరించిన ఈ పాటను సురైయా టైటిల్‌తో ప్రోమో విడుదల చేశారు. పచ్చ, ఎరుపురంగు కాంబినేషన్ లెహెంగాలో ఆధునిక నాట్య విన్యాసాన్ని ప్రదర్శిస్తూ అదరగొట్టేసింది కత్రినా. ఆమె డ్యాన్స్‌కు చుట్టూ నిలబడిన బ్రిటిషర్లూ నోరెళ్లబెట్టి ఉండిపోయారు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌లో సెనే్సషన్ అవుతోన్న మరో సాంగ్ ‘వష్‌మల్లే’ ప్రోమోను సైతం త్వరలోనే విడుదల చేయనున్నార్ట. అమితాబ్, అమీర్ కలిసి చేసిన డ్యాన్స్ ఓ సెనే్సషన్ క్రియేట్ చేయబోతోందన్న నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కంపోజిషన్‌లో వీరిద్దరి డ్యాన్స్ సినిమాకు హైలెట్టేనని ఇప్పటికే దర్శకుడు విజయ్ మీడియాలో ఊదరగొట్టాడు. దీపావళి సందర్భంగా నవంబర్ 8న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుంటే, ప్రత్యేకమైన సినిమాగా తెస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌కు పదిశాతం టికెట్ ధరలు పెంచనున్నారు. మల్టీఫ్లెక్స్, సింగిల్‌స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెరుగుతాయన్న మాట. ‘సంజు’, ‘రేస్ 3’ సినిమాలకంటే పది శాతం ఎక్కువ పెంచాలని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతిపాదిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ మొదలపెట్టక ముందే టికెట్ ధరలు ఏమాత్రం పెంచుతున్నారో వివరాలు అందించాలని థియేటర్ల యాజమాన్యాలను కోరింది. 1839నాటి నవల ‘కన్‌ఫెషన్స్ ఆఫ్ ది థగ్’ ఆధారంగా భారీ బడ్జెట్‌తో మాల్టా, రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.