ఎ లిటిల్ బర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కమనసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా హీరోయిన్ నిహారిక ఆ తరువాత చేసిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయింది. దాంతో అటు తమిళంలో అయినా సక్సెస్ అవ్వాలని అక్కడా ప్రయత్నాలు చేసింది. అక్కడా పరిస్థితి మారకపోవడంతో తెలుగులోనే బెటర్ అనే ఉద్దేశ్యంతో ఇక్కడే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం శ్రీయతో కలిసి నిహారిక నటించే చిత్రం తెరపైకి రానుంది. నూతన దర్శకుడు సుజన్ తెరకెక్కించే చిత్రానికి కంచె సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జ్ఞానశేఖర్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయట. త్వరలోనే సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి ఎ లిటిల్ బర్డ్ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఏ లిటిల్ బర్డ్ అనే షార్ట్ ఫిలిం ఆధారంగా తెరకెక్కిస్తారట. అక్కా చెల్లి మధ్య జరిగే మానసిక సంఘర్షణ నేపథ్యంలో చిత్రం ఉంటుందని టాక్. మరి ఈ లిటిల్ బర్డ్ అయినా నిహారిక ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి!