దేవ్‌ది మరో దారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయ్. అర్థంకాని చదువు చదివి.. ఇష్టంలేని ఉద్యోగం చేసి.. ముక్కూమొహం తెలీని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి.. ఈగో, ప్రెజర్, కాంపీటీషన్‌లలో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతుందో అర్థంకాకుండా బతకడం ఓ దారి. ఇంకో దారి ఉంది..’ అంటూ కార్తి డైలాగ్‌తో ‘దేవ్’ టీజర్ విడుదలైంది. తెలుగులో చోటుకోసం గట్టిగానే కృషి చేస్తున్న తమిళ కార్తీ -కొత్త చిత్రం ‘దేవ్’. లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకుడు. చిత్రంలో కార్తితో రకుల్ ప్రీత్‌సింగ్ జోడీ కట్టింది. కార్తి క్యారెక్టరేజన్‌కు డెఫినిషనిస్తూ దేవ్ టీజర్ కట్ చేయడం బావుంది. బైక్‌ముందు స్టయిల్‌గా నిలబడిన కార్తి ఫస్ట్‌లుక్‌లోనే -ఇదేదో రేసింగ్ బేసడ్ పిక్చర్ అన్న డౌట్స్ వచ్చాయి. టీజర్‌తో దానికి క్లారిటీ ఇచ్చేశారు. బైక్ రేసర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడన్నది దాదాపు నిర్థారణ అయినట్టే. ఒక ప్లేస్‌లో కార్తిని రౌడీలు రౌండ్ చేయడం, స్టయిలిష్ డైలాగులతో ‘దేవ్’ యాటిట్యూడ్ ఎక్స్‌పోజయ్యే సన్నివేశాన్ని టీజర్‌లో కట్ చేయడం చూస్తుంటే -లోడెడ్ యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చాడు. -రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.