హైదరాబాద్‌లో సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం మళ్లీ షూటింగ్ మొదలవ్వనుంది. రెండువారాల క్రితం జార్జియాలో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్‌లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే భారీ యుద్ధ సన్నివేశాల నేపథ్యంతో కూడిన క్లైమాక్స్‌నూ కెమెరామెన్ రత్నవేలు భారీ పరికరంతో చిత్రీకరించిన విషయం తెలిసిందే. కాగా రెండు వారాలపాటు రెస్ట్ తీసుకున్న చిత్రబృందం త్వరలోనే హైదరాబాద్‌లో షూట్ మొదలెట్టనుంది. ఈ షూట్‌లోని సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని అంటోంది చిత్రబృందం. చిరు సరసన నయనతార కథానాయికగా చేస్తుంటే, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.