సెన్సార్ దాటిన కొత్త కుర్రోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజానాయుడు ఎన్ దర్శకత్వంలో పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మిస్తోన్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. శ్రీరామ్, శ్రీప్రియ హీరోహీరోయిన్లు. సినిమా సెన్సార్ పూర్తయిన సందర్భంగా నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ డైరెక్టర్ రాజానాయుడు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. హీరో హీరోయిన్ల నటన సినిమాకు హైలెట్. సాయి ఎలెందర్ సంగీతంలోని పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు రాజానాయుడు ఎన్. మాట్లాడుతూ ‘ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సహకారంతో సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేయగలిగాను. అడ్డంకులు తలెత్తినా నిర్మాత లక్ష్మణ్ మాకు అండగా నిలబడి సినిమాను పూర్తిచేయించారు. సినిమాటోగ్రాఫర్ సతీశ్ చక్కటి విజువల్స్‌తో సినిమాను పిక్చరైజ్ చేశారు. మా అమ్మాయి శ్రీప్రియను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాను. హీరో శ్రీరామ్ చక్కగా యాక్ట్‌చేశాడు. త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘రాజానాయుడునాకు హీరోగా అవకాశమిచ్చారు. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా అన్నాడు. హీరోయిన్ శ్రీప్రియ మాట్లాడుతూ దర్శకుడు మా నానే్న అయనా నన్ను ఆడిషన్‌లోనే ఎంపిక చేశారు. చిత్రంలో మంచి రోల్ చేశానని ఆనందం వ్యక్తం చేశారు. పదిలం కళ్యాణ్‌బాబు, జెవి రావు, యోగి, అంజలి, శ్రావణి, మాధవీలత, ఆశ తదితరులు మిగిలిన పాత్రల్లో నటిస్తున్నారు.