సంక్రాంతి అల్లుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ కొత్తదనానికి పెద్దపీట వేసే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో రూపొందున్న మల్టీస్టారర్ ఎఫ్2. ఫన్ అండ్ ప్రస్టేషన్ ట్యాగ్‌లైన్. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. మంచి మెసేజ్‌తోపాటు ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టువున్న అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్‌లో వస్తోన్న ఔట్ అండ్‌ఔట్ ఫ్యామిలీ ఫన్ రైటర్ ఎఫ్2. మెసేజ్‌తోపాటు అన్ని కమర్షియల్ హంగులను పర్‌ఫెక్టుగా తెరకెక్కించే దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తోన్న చిత్రమిది. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. ఇప్పటివరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. క్లైమాక్స్, మూడు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.