తరువాతేంటి.. అంటున్న తమ్మూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య ఒకింత వెనుకబడిన మిల్కీ బ్యూటీ మళ్లీ బిజీ అయిపోయింది. ఒకదాని వెనుక ఒకటిగా ప్రాజెక్టులకు సైన్ చేసేస్తోంది. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది మిల్కీ బ్యూటీ. అభినేత్రి-2, ఎఫ్-2 ప్రాజెక్టులతో బిజీగావున్న తమ్మూ బేబీ, తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్‌కు జోడీగా ‘నెక్స్ట్ ఏంటి’ ప్రాజెక్టు చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో, సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నవదీప్, పూనమ్‌కౌర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. లండన్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోన్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్, టీజర్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని రైనా జోషి, అక్షయ్‌పూరి నిర్మాతలు. ఈ ప్రాజెక్టులో నడుస్తుండగానే తమ్మూ బేబీ ‘దటీజ్ మహాలక్ష్మి’, హిందీలో ‘ఖామోషీ’ చిత్రాలు చేస్తోంది.