జనవరిలో మిస్టర్ మజ్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బీవీఎస్‌ఎన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. చిత్రీకరణ జరుగుతోన్న ప్రాజెక్టును అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా అఖిల్ కొత్త స్టిల్, పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న చిత్రానికి సినిమాటోగ్రఫీ జార్జ్ సి.విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి.