సినీ జర్నలిస్ట్‌లకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు కాదు. సినిమాపరంగా రెండూ ఒక్కటే. సినీ జర్నలిస్ట్‌లు, పేద కళాకారులకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుంది’ అని ఏపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సినీ జర్నలిస్ట్(ఈటీవీ) సత్యనారాయణకు సీఎం సహాయ నిధి నుంచి 7 లక్షల ఆర్థిక సాయం అందచేసిన సందర్భంగా మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్ర రెండు కళ్లలాంటివి. సినిమాపరంగా రెండూ ఒక్కటే. సినీ జర్నలిస్ట్‌లు, పేద కళాకారులకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. తెదేపా పుట్టిందే అద్భుతమైన నటుడు ఎన్టీఆర్ నుంచి. ఆయన నటుడిగా, పరిశ్రమలో మూల స్థంభంగా అందరి మనసుల్లో ఉంటారు. అందరికంటే మాకు సినిమా జర్నలిస్ట్‌లంటే ప్రత్యేకమైన అభిమానం. సత్యనారాయణకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.9 లక్షలు అందించడం గొప్ప విషయం. దీనికితోడు ‘మా’కూడా తనవంతు సాయం అందించింది. తోటి పాత్రికేయుడిని ఆర్థికంగా ఆదుకున్న జర్నలిస్ట్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ వైజాగ్‌లో ఉంటుందా? అమరావతిలో ఉంటుందా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నారు. కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ సినిమా జర్నలిస్ట్‌లు కూడా సినిమారంగంలో భాగమేనన్నారు. అందుకే వారిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ‘మా’ ముందుంటుందని చెబుతూ, సత్యనారాయణకు మా నుంచి లక్ష రూపాయల సాయం అందించామన్నారు.