హిప్పీ మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ, దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టి.ఎన్.కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘హిప్పీ’. వీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ- ఆర్‌ఎక్స్ 100 సినిమా తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోయింది. ఆర్‌ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు టి.ఎన్.కృష్ణ ఈ సినిమా కథ చెప్పారు. తర్వాత నిర్మాత కలైపులి థాను ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. దాంతో మరింత ఉత్సాహం కలిగింది. కలైపులి థాను దక్షిణాదిలో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ తెలుసు. కబాలిలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత. ఈ సినిమా నా కెరీర్‌ని టాప్ లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను అన్నారు. దర్శకుడు టి.ఎన్.కృష్ణ మాట్లాడుతూ- దర్శకుడిగా నాకు తెలుగులో తొలి స్ట్రెయిట్ చిత్రం హిప్పీ. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం. ఆర్ ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమిళంలో మంచి క్రేజ్ వున్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ- హిప్పీ సినిమా కథ తెలుగువారందరికీ నచ్చుతుంది. కథ వినగానే కార్తికేయ ఓకె అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. తర్వాత శ్రీలంకలో బారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.