లైఫ్‌లో కొత్తమలుపు శరభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘శరభ’. ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అశ్వనికుమార్ సహదేవ్ నిర్మించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆర్ నారాయణమూర్తి మేకింగ్ వీడియోను విడుదల చేయగా, ట్రైలర్‌ను జయప్రద, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు విడుదల చేశారు.
దర్శకుడు నరసింహారావు మాట్లాడుతూ ‘సినిమా నిర్మాణానికి, విడుదలకూ చాలా టైం పట్టింది. నవంబర్ 22న విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. ఎర్రసైన్యంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. నారాయణమూర్తి ఫౌండేషన్ నన్నింత దూరం తీసుకొచ్చింది. పలువురు పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో ఈ సినిమా చేశాను. ఛాన్స్ ఇచ్చిన అశ్వనికుమార్‌కు థ్యాంక్స్. సున్నితంగా పెరిగిన ఆకాశ్‌ను చాలా కష్టపెట్టాను. మిస్తీ చాలా బాగాచేసింది. జయప్రదలాంటి నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నట ప్రావీణ్యాన్ని సినిమాలో చూడొచ్చు. సినిమాకు సహకరించిన టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత అశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ ‘సిన్సియర్ ఎఫర్ట్‌తో సినిమా రూపొందించాం. నవంబర్ 22న విడుదలవుతున్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. హీరో ఆకాష్‌కుమార్ మాట్లాడుతూ ‘మంచి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాకోసం చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
హీరోయిన్ మిస్తీ చక్రవర్తి మాట్లాడుతూ కష్టపడి సినిమాకు వర్క్‌చేశాం. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. మంచి సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన గ్రేట్ ఆర్టిస్ట్ జయప్రద. ఆమె నటించిన ఈ సినిమాకూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా. ట్రైలర్ చూస్తుంటే మంచి ఓపెనింగ్స్ వచ్చే సినిమాలా అనిపిస్తోంది. సక్సెస్‌మీట్ జరుపుకునేలా విజయం సాధించాలని ఆశిస్తున్నా’ అన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘సినిమా రిలీజ్ అవుతుందా అని చాలామంది అపోహపడ్డారు. సినిమా గ్రాఫిక్స్‌వల్లే ఆలస్యమైంది. దర్శకుడు నాదగ్గర పని చేస్తున్నపుడు, టాలెంట్ వుంది బయటకు వెళ్లి ట్రై చేయమని చెప్పాను. ఇప్పుడీ సినిమా తీశాడు. కథను, దర్శకుడిని నమ్మి రూ.20 కోట్లతో సినిమా తీసిన నిర్మాతకు హ్యాట్సాఫ్. ఏ సినిమా అయినా సక్సెస్ తర్వాత వచ్చే పేరు హీరోకే. ఈ సినిమాతో ఆకాశ్‌కు పేరు రావాలని ఆశిస్తున్నా అన్నారు.
జయప్రద మాట్లాడుతూ ‘తెలిసీ తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. పరిశ్రమే నన్ను ఇంతదాన్ని చేసింది. ఎప్పటికీ ఈ రుణం తీర్చుకోలేను. మళ్లీ జయప్రదగా తెలుగు బిడ్డగానే పుట్టించాలని దేవుడుని కోరుకుంటున్నా. అశ్వనికుమార్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. పెద్ద బిజినెస్‌మేన్ అయిన ఆయన దుబాయ్‌లో మహారాజులా ఉండొచ్చు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోను పరిచయం చేయాలనే ధైర్యంతో తన కొడుకు ఆకాశ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. పాటలు, ఫైట్స్ లాంటివి తెలియని సున్నితమైన ఆకాశ్‌తో ‘శరభ’లాంటి భారీ చిత్రం రూపొందించిన దర్శకుడు నరసింహకు హ్యాట్సాఫ్. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి గురించి చెప్పాలంటే, ఆమె నవ్విందంటే అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు. అంత అందం ఆమెది. భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలో తల్లి కొడుకు అనే ఎమోషన్‌ను ఇమడ్చటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. శరభలాంటి సినిమా రావడానికి కూడా ఇది సరైన సమయమని భావిస్తున్నాను. ఆడియన్స్ ఆదరిస్తారనే గొప్ప ధైర్యం నాకుంది. నా జీవితంలో కొత్త మలుపు శరభతో స్టార్ట్‌అవుతోంది కాబట్టి నన్ను ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరుతున్నా’ అన్నారు.