విజయ్ సరసన నయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళయ దళతి విజయ్ 63వ చిత్రాన్ని కూడా త్వరలో పట్టాలెక్కించనున్నాడు. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ, విజయ్ తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా, తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్-అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్స్ నయనతార, సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో నయనతార విల్లు చిత్రంలో విజయ్ సరసన నటించగా.. సమంత తేరి, మెర్సల్ చిత్రాల్లో విజయ్‌కి జోడీగా నటించింది. ఇక విజయ్, అట్లీల కలయికలో వచ్చిన తేరి, మెర్సల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్‌లో ఈసారి రాబోయే చిత్రం కూడా సూపర్‌హిట్ అవ్వడం ఖాయం అని, విజయ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.