నవరస అమృతవర్షిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరత్న, మేఘశ్రీ జంటగా చాందిని క్రియేషన్స్ పతాకంపై శివప్రభు దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘అమృతవర్షిణి’. షూటింగ్ రామానాయుడు స్టూడియోలో మొదలైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో నారా రోహిత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మరో హీరో శ్రీకాంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో హీరో నందమూరి తారకరత్న మాట్లాడుతూ అభిరుచి కలిగిన దర్శక నిర్మాతలు కావడం, కథ నచ్చడంతో సినిమా చేస్తున్నట్టు చెప్పారు. ఇంటెన్స్‌వున్న స్టోరీ అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అమృతవర్షిణి అన్నారు. మంచి టీమ్ కుదిరిందని, సినిమాపై హోప్స్‌తో ఉన్నామన్నారు. దర్శకుడు శివప్రభు మాట్లాడుతూ ఫస్ట్ సిట్టింగ్‌లోనే తారకరత్న స్టోరీ ఫైనల్ చేశారన్నారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా తెలుగు, కన్నడ భాషల్లో సినిమా తీస్తున్నారని, థ్రిల్లర్, లవ్, సస్పెన్స్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుందన్నారు. యూత్‌కు, కుటుంబాలకు నచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను చిక్ మంగుళూరులో సింగిల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేస్తామన్నారు. నిర్మాత నాగరాజు నెక్కంటి మాట్లాడుతూ ఇది తొలి సినిమా అని, దర్శకుడు మంచి మిత్రుడు కావడంతో సినిమా చేస్తున్నానన్నారు. కన్నడలో నాలుగు సనిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడని, మంచి కథ చెప్పడంతో కన్నడ, తెలుగు భాషల్లో సినిమా ప్లాన్ చేశామన్నారు. జెస్సీ గిఫ్ట్ మ్యూజిక్ అందిస్తున్నాడని, 20న సినిమా ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేస్తామన్నారు. హీరోయిన్ మేఘశ్రీ మాట్లాడుతూ సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్ర చేస్తున్నానని, పెర్ఫార్మెన్స్‌కు స్కోపున్న పాత్ర అని చెప్పింది.