స్వయంవద ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం టైటిల్‌ను బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఆవిష్కరించారు. చిత్ర టైటిల్‌ను అల్లాణి శ్రీ్ధర్, లోగోను ఎవిఎ సుబ్బారావు, మోషన్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అల్లాణి మాట్లాడుతూ యువత ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడిందన్న ఇతివృత్తంతో చేస్తున్న సినిమా తప్పకుండా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ ఇలాంటి వైవిధ్యమైన కథలను ఎంకరేజ్ చేయాలంటే నిర్మాత కూడా అంతే పాషన్‌తో ఉండాలన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లడుతూ స్వయంవద అన్న సంస్కృత పదానికి ప్రత్యేకత ఉందన్నారు. ఇందులో హీరోయిన్ 6 గెటప్స్‌లో కనిపిస్తుందని, ప్రతి గెటప్‌లోనూ డిఫరెంట్ వేరియేషన్స్‌తో అనికారావు చక్కగా నటించిందన్నారు. సంస్కృత ప్రత్యేకతవున్న కథను కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కించామన్నారు. హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ వైవిధ్యమైన కానె్సప్ట్ చిత్రాన్ని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలన్నారు. హీరోయిన్ అనికారావు మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి భిన్నమైన సినిమాలో ఆరు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. కార్యక్రమంలో రామజగన్, లోహిత్‌కుమార్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.