కంటెంటే సినిమాకు ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ లక్కీ మీడియా బ్యానర్‌పై పలు విభిన్న కథాచిత్రాలను నిర్మిస్తున్నాడు బెక్కం వేణుగోపాల్. తాజాగా తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణన్, దక్ష నాగర్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లీ, రమ్య, కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హుషారు’ చిత్రం ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ చెప్పిన విశేషాలు..

మా లక్కీ మీడియా బ్యానర్‌లో వస్తున్న 9వ సినిమా ఇది. దర్శకుడు శ్రీహర్ష ఈ స్క్రిప్ట్ చెప్పాడు. కథ నచ్చింది. వెంటనే సినిమా మొదలుపెట్టాం. సినిమా మొత్తం రెడీ అయింది. దర్శకుడు శ్రీహర్ష బాలీవుడ్‌లోనూ కొన్ని షార్ట్ఫిల్మ్స్ చేశాడు. సంగీత దర్శకుడు రథన్‌కి అందాల రాక్షసి నుంచి నేను ఫ్యాన్. ఈ సినిమాకు మంచి ట్యూన్లనిచ్చారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత తను సంగీతం చేసిన సినిమా ఇది. ఈ కథకి కొత్త కుర్రాళ్లు సరిపోతారనుకున్నాం. అందుకే కొత్త వాళ్లతో ప్రయత్నం చేసాం.. తేజస్ ఇంతకుముందు ఉలవచారు బిర్యానీ, కేటుగాడు అని రెండు సినిమాలు చేశాడు. మిగిలిన వాళ్లందరూ కొత్తవారే. అయినా చాలాబాగా చేశారు. ఈరోజుల్లో లైఫ్‌కి గ్యారంటీ లేదు. ప్రతి సెకనూ హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మెమరీస్ తప్ప మనం జీవితంలో ఇంకేంటినీ పైకి తీసుకెళ్ళలేం అనే కానె్సప్ట్‌తో సినిమాను తెరకెక్కించాం. ఓ నలుగురు కుర్రాళ్ల లైఫ్ జర్నీ ఈ సినిమా. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట విశేషంగా అలరిస్తుంది. మా బ్యానర్‌లో ఇది ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాగే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక ఈ సినిమా తరువాత మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే తెలియజేస్తా.. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కొత్తతరహా సినిమాలు వస్తున్నాయి. కొత్తదనాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. తప్పకుండా అదే కోవలో మా హుషారు ఉంటుందని ఆశిస్తున్నా అన్నారు.