ఇదో.. క్రేజీ క్రేజీ ఫీలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. విష్వంత్, పల్లక్ లల్వాని హీరో హీరోయన్లు. లిరికల్ వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ కేరింత, మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వంత్ హీరోగా, పల్లక్ లల్వాని హీరోయిన్‌గా ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ చిత్రం తెరకెక్కిందన్నారు. ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్‌ని వినోదాత్మకంగా చూపిస్తున్నామని, వెనె్నల కిశోర్ లెంగ్తీ క్యారెక్టర్లో కడుపుబ్బ నవ్విస్తాడన్నారు. ఈ సినిమాకు వెనె్నల కిశోరే మెయిన్ పిల్లర్ అంటూ, నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ సినిమా తీశారన్నారు. టీజర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై కాన్ఫిడెన్స్ పెరిగిందన్నారు. నిర్మాత మధు మాట్లాడుతూ ప్రేమ, ఫీల్, వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్‌ఫుల్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా క్రేజీ క్రేజీ ఫీలింగ్‌ని రూపొందిస్తున్నారు. కథ నచ్చడంతో వెనె్నల కిశోర్ చాలా సపోర్ట్ చేశారని, భీమ్స్ మంచి పాటలందించారన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే పెద్దఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు