హుషారుగా హుషారు టూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కీ మీడియా నిర్మిస్తున్న సినిమా ‘హుషారు’. తేజెస్ కంచెరల్, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని కీలక పాత్రధారులు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ టీమ్ తెలుగురాష్ట్రాల్లో టూర్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ఈ సినిమా పాటలు ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యి యూత్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇదే హుషారుతో చిత్ర యూనిట్ మొత్తం ఆఫీసునుండి సాయిబాబా ఆశీస్సులతో బయలుదేరింది. ఈ బస్సు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వున్న అన్ని ముఖ్య నగరాలు మరియు కాలేజీలు, షాపింగ్ మాల్స్, ఎఫ్‌ఎం స్టేషన్స్‌లో సందడి చేయనుంది. మొత్తం పది నగరాల్లో సుమారు ఇరవై కాలేజీల్లో స్టూడెంట్స్‌తో సందడి చేసి వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 7న చిత్రం విడుదల కానుంది.