డిసెంబర్ 22నుంచి కాకతీయ ఫిలిం ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాచార భారతి సాంస్కృతిక సంస్థ వచ్చే నెల 22న రెండవ ‘కాకతీయ ఫిలిం ఫెస్టివల్’ను నిర్వహించనున్నది. భారతీయకు పునాదులైన సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు, సామాజిక విలువలు పెంపొందించడం కోసం పోటీ ముఖ్య ఉద్ధేశ్యమని సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. గోపాల్ రెడ్డి, కార్యదర్శి ఎన్. ఆయుష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీకి పంపించే చిత్రాలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పంపించాలని వారు తెలిపారు. మూకీ చిత్రాలకు కూడా ప్రవేశం ఉందని పేర్కొన్నారు.
లఘు చిత్రాల నిడివి 20 నిమిషాలు, డాక్యుమెంటరీ చిత్రాల నిడివి 30 నిమిషాలు మించరాదని తెలిపారు. పోటీకి పంపించే చిత్రాలు ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 30 లోపు తీసినవి, సొంతం అయినవి ఉండాలని, వీటిని హెచ్‌డి ఫార్మాట్‌లో ఈ నెల 30వ తేదీలోగా పంపించాలని వారు వివరించారు. రిజిస్ట్రేషన్ ఫిలిం ఫెస్టివల్ వెబ్‌సైట్ http://kakatiyafilmfestival .com కు చేసుకోవాలని వారు సూచించారు. ఎంపిక చేసిన చిత్రాలు 22న ప్రదర్శించగలమని తెలిపారు. ఇతర వివరాలకు ఎస్. చంద్రశేఖర్ 76808 84181లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.