చైనా స్క్రీన్స్‌పై చిట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీ, శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై 550 కోట్లతో సుభాస్కరన్ నిర్మించిన విజువల్ వండర్ ‘2.0’. నవంబర్ చివర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న 2.ఓ మొదటి 4 రోజుల్లో 400 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఉత్సాహంతో చైనాలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ చైనాలోని హెచ్‌వై మీడియాతో భాగస్వామ్యమై ‘2.ఓ’ను చైనా భాషలోకి డబ్ చేసి విడుదల చేయబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సోని, ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, డిస్నీలతో భాగస్వామ్యమైన హెచ్‌వై ఎన్నో సినిమాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్ రజనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకొని గ్రాండ్‌గా ‘2.ఓ’ను విడుదల చేస్తున్నారు. చైనాలో పదివేల థియేటర్స్‌లో 56వేల స్క్రీన్స్‌పై సినిమా విడుదల కానుందట. అందులో 47వేల స్క్రీన్స్‌లో 3డి వెర్షన్ ప్రదర్శించనున్నారు. వచ్చే మేలో 2.ఓను చైనా స్క్రీన్స్‌పై ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి.