కోచ్‌గా విజయ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించనున్న 63వ సినిమా సెట్స్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌కి ‘తెరి, మెర్సల్’ చిత్రాల రూపంలో బ్లాక్‌బ్లాస్టర్ విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీ ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడని చెన్నై సినీవర్గాల కథనం. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా విజయ్‌తో మళ్లీ జోడీ కడుతుంది. భారీ బడ్జెట్‌తో ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది. ఇక విజయ్ నటించిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘సర్కార్’ నిన్నటితో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో విజయ్ మరోసారి బాక్సాఫీస్‌వద్ద తన సత్తా చాటాడు.