ఇన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే ఒక్క పెళ్లిచూపులు చిత్రంతో అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ రీతూ వర్మ. ఆధునిక తరంలోని గడుసుపిల్లగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రీతు -ఆ తరువాత ‘కేశవ’ చేసినా ఆశించిన స్థాయిలో ఇమేజ్ రాలేదు. కేశవ చిత్రం సైతం ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవడంతో -రీతూవర్మ పెర్ఫార్మెన్స్‌కూ ఆదరణ దక్కలేదు. రెండో సినిమా నిరాశపర్చడంతో తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి. అదే టైంలో ఆమె తమిళంపైనా దృష్టి పెట్టడంతో చేతిలో సినిమాలే లేకుండాపోయాయి. అందం, అభినయం కలబోతగా కనిపించే రీతూ వర్మకు చాలా గ్యాప్ తరువాత తెలుగు ప్రాజెక్టు దక్కింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేస్తున్న ప్రాజెక్టులోకి రీతూని తీసుకున్నట్టు వినికిడి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సిద్ధమవుతున్న ప్రాజెక్టుతో రీతూ నానితో ఆడిపాడనుందని సమాచారం. థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి మొదలవుతుందట.