సక్సెస్‌ఫుల్‌గా సుబ్రహ్మణ్యపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్’ పతాకంపై బీరం సుధాకరరెడ్డి నిర్మించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషా రెబ్బ జంటగా నటించిన మూవీతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలైన మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త దర్శకుడైనా సంతోష్ కథను చాలా గ్రిప్పింగ్‌గా నడిపాడు. సీన్ బై సీన్ ఉత్కంఠత పెంచే కథనం సుబ్రహ్మణ్యపురంను హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో పరుగులు పెట్టిస్తుంది. బాల సుబ్రహ్మణ్యం పాడిన ‘సహో షణ్ముఖ’ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్‌గా నిలిచాయి. ఆల్ రౌండ్ సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత బీరం సుధాకరరెడ్డి పాల్గొన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విడుదలైనా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. విడుదల సమయంనుంచీ మంచి రిపోర్ట్స్ విన్నాను. సంతోషంగా ఉంది. సంతోష్ లాగా ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే ఏ జానర్‌లో అయినా సినిమా చేయడానికి రెడీగా ఉన్నా అన్నారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ ముఖ్యంగా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత బీరం సుధాకరరెడ్డి, హీరో సుమంత్‌కి థాంక్స్. సినిమాపై స్ట్రాంగ్ రిపోర్ట్ వచ్చింది. సెకండ్ హాఫ్ కథనంపై మంచి ప్రశంసలు వస్తున్నాయి. మీడియా సపోర్ట్ మర్చిపోలేనిది అన్నారు. నిర్మాత బీరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ మార్నింగ్ షోస్ నుండే హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధించింది. సంతోషంగా ఉన్నాను. అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి సహకరించిన హీరో సుమంత్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’ అన్నారు.