రజనీ థర్డ్ లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్ సుబ్బరాజు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రజనీకాంత్ చిత్రం పేట. కలిసొచ్చిన అదృష్టంతో త్రిష, సిమ్రాన్‌లు రజనీ సరసన అవకాశాలు అందుకున్నారు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆడియోను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఇప్పటికే పేట రెండు లుక్కులను విడుదల చేసిన యూనిట్, ఈసారి వేడుకకు ముందు రజనీ థర్డ్‌లుక్‌నీ విడదల చేసింది. రజనీకాంత్, త్రిషలను చూపిస్తూ విడుదల చేసిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంప్రదాయబద్ధంగా కనిపిస్తోన్న త్రిషను ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతున్న రజనీకాంత్ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రజనీ యంగ్ లుక్, దీనికితోడు బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తున్న కొన్ని ప్రాపర్టీలు గమనిస్తే -చిత్రంలోని ఏదైనా ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన దృశ్యమై ఉండొచ్చన్న విషయం అర్థంకాకపోదు. పేటలో రజనీది ద్విపాత్రాభినయం అన్న సమాచారం వినిపిస్తోన్న నేపథ్యంలో -ఈ సీన్ పెద్ద రజనీ పాత్రదై ఉండొచ్చని కూడా అనిపిస్తోంది. అనిరుథ్ సంగీతం సమకూరుస్తున్న పెటా -సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే యూనిట్ ప్రకటించడం తెలిసిందే.