మల్టీస్టారర్‌లో నటించడం ఇష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్, సురభి ప్రధాన తారాగణంగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ రూపొందించిన చిత్రం ‘అటాక్’. పాతబస్తీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తన పాత్ర వైవిధ్యంగా వుంటుందని మనోజ్ తెలిపారు. ఆయన చిత్ర విశేషాలు తెలిపారు.
* అటాక్ ఎవరికి?
- అది తెలియాలంటే సినిమా చూడాలి. సినిమాలో వున్న పాత్రలు అందరికీ సమానంగా వుంటాయి. నిజంగా జరిగిన సన్నివేశాల నేపథ్యంలో సాగే చిత్రం ఇది. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంగా ధూల్‌పేట ప్రాంతంలో కథ సాగుతుంది. రెండు గ్రూపులమధ్య వుండే విభేదాలను ప్రధానంగా తీసుకుని చేసిన చిత్రం ఇది.
* మీ పాత్ర గురించి?
- ఇందులో నా పాత్ర పేరు రాధాకృష్ణ. చదువుకొని ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా వుండే ఆ పాత్ర, అనుకోకుండా గొడవల్లోకి వెళుతుంది. ఫ్యామిలీ డ్రామాగా అన్నిరకాల ఎమోషన్స్‌తో రూపొందించిన చిత్రం. ఈ సినిమాలో ఒక్కచోట కూడా నేను నవ్వినట్టు కనపడదు.
* మిగతా పాత్రల గురించి?
- ప్రకాష్‌రాజ్ నా తండ్రిగా నటించాడు. ఆయన కొడుకులుగా జగపతిబాబు, నేను, నవీన్ చేశాం. హీరోయిన్ సురభికి మంచి పాత్ర దొరికింది. ఉన్నత విద్య చదువుకున్న అమ్మాయి. ఇన్నోసెంట్‌గా వుంటుంది.
* వర్మతో చేయడం?
- నిజంగా ఆయన మంచి టెక్నీషియన్. ఆయనతో సినిమా తీస్తే అద్భుతంగా వుంటుంది. ఆయనతో పనిచేయడం మంచి అనుభవం.
* ఇన్ని సినిమాలు చేసినా ఇమేజ్ రాలేదు కదా మీకు?
- అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు. నేనెప్పుడూ ఇమేజ్‌కోసం సినిమాలు చేయలేదు. నన్ను నేను నటుడిగా నిరూపించుకోవాలనుకున్నాను. కాబట్టే ఆ తరహా పాత్రలు చేశా.
* కమర్షియల్ సక్సెస్ అవసరం కదా?
- నిజమే. మనకు పనిలేనప్పుడు దానిగురించి ఆలోచించాలి. కానీ, నాకెప్పుడూ చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు.
* ఈ సినిమా చూసి మీ నాన్న స్పందన?
- సినిమా చూసిన ఆయన చాలా బాగా చేశావ్ అన్నారు. సెకెండాఫ్ చాలా బాగుంటుంది. చాలా కొత్తగా కన్పించావు అన్నారు. అలాగే కుటుంబం అందరు కూడా సపోర్టు చేశారు.
* మల్టీస్టారర్ చిత్రాలు?
- తప్పకుండా. మల్టీస్టారర్ చిత్రాల్లో అవకాశాలు వస్తే చేయడానికి నేనెప్పుడూ ముందుంటాను.
* తరువాతి చిత్రాలు?
- ప్రస్తుతానికి రెండు సినిమాలు చర్చల్లో వున్నాయి. అందులో ఒకటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రెండోది యాక్షన్ మూవీ. త్వరలో వాటి గురించి తెలియజేస్తా.

-శ్రీ