స్వేచ్ఛ విలువ తెలిపిన ఊపిరి నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాంతం వీల్‌చెయిర్‌లో వుండేవారు ఎంత ఇబ్బంది పడతారో తనకు తెలుసునని, అమ్మ కూడా ఆర్థరైటిస్ సమస్యతో ఎనిమిదేళ్లు ఇబ్బంది పడడం చూసి చాలా బాధపడేవాడినని, ‘ఊపిరి’ సినిమా చేయడంవల్ల జీవితంలో స్వేచ్ఛ విలువ ఏంటో తెలిసిందని నటుడు నాగార్జున తెలిపారు. పి.వి.పి పతాకంపై పైడిపల్లి వంశీ దర్శకత్వంలో నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా రూపొందిన ఊపిరి చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వీల్‌ఛెయిర్‌లో జీవితాన్ని గడిపే పాత్రలో నాగార్జున నటించారు. నిజంగా జీవితంలో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారినందరిని ఒకచోట చేర్చి వారితో చిట్‌చాట్ నిర్వహించి వారిలో ధైర్యాన్ని పెంపొందే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, మందు శరీరానికే కాని మనసుకు కాదని, వీల్‌ఛెయిర్‌లో వుండేవారు డిజేబుల్డ్ వ్యక్తులు కాదని, డిఫరెంట్ ఏబుల్డ్ వ్యక్తులుగా తాను భావిస్తానని అన్నారు. వారిని చిన్నచూపు చూసేవారికి పాజిటివ్ థింకింగ్ వుండాలని చెబితే, వారితో ఏదైనా సాధించవచ్చునని ఓ సందేశాన్ని ఈ చిత్రం ఇచ్చిందని ఆయన తెలిపారు. కార్తి చెల్లెలను తన చెల్లెలుగా భావించి వారి సమస్యను తీర్చిన సందర్భంలో ఎమోషన్, ఆ సన్నివేశంలోనే తాను చెల్లెలి పెళ్లికోసం పెయింటింగ్స్ వేసుకోవాలంటూ కామెడీ చేసే కార్తి, అలాగే తన కాళ్ళపై వేడినీరు పోసే సీన్, ఇలాంటివి మనసుకు నచ్చే అనేక సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రం తరువాత ఆలోచనా విధానంలో మానసికంగా మార్పులు వచ్చాయని, ఈ సినిమాలో హీరోలు, స్టార్లు లేకుండా కేవలం పాత్రలే కనబడతాయని, ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి నమ్మకాన్ని మరింత పెంచారని ఆయన అన్నారు. ఈ సినిమా చేయడం ఓ ఎమోషనల్ జర్నీగా తాను భావిస్తున్నానని, జీవితంలో తోడు అవసరమని చెప్పే ఈ చిత్రం అనేకమంది జీవితాలపై ప్రభావం చూపిస్తున్నందుకు ఆనందంగా వుందని, ఈ చిత్రంతో తమ బాధ్యత పెరిగిందని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. మనుషుల మధ్య సంబంధాలను అందంగా తెలియజేసే చిత్రంగా ఊపిరి రూపొందిందని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. కార్యక్రమంలో కార్తి వేసిన పెయింటింగ్‌ను వేలంవేసి ఆ మొత్తానికి కొంత కలిపి ఛాలెంజర్స్ ఆన్ వీల్స్ అసోసియేషన్‌కు అందజేస్తామని ఆయన అన్నారు. సుజి, డా.పూజ ఆధ్వర్యంలో ఛాలెంజర్స్ ఆన్ వీల్స్ అనే అసోసియేషన్‌ను ప్రారంభించారు. సుజి, మహిత్ నారాయణ, పద్మప్రియ, పద్మ, స్వాతి, తోయేజాక్షి సహా పలువురు వీల్‌ఛెయిర్ ఫ్రెండ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.