లక్ష్మీస్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాపై ప్రేక్షకులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చుకానీ ఆయన నిజ జీవిత పాత్రలకు నటీనటులను ఎంపిక చేసకొనే తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వర్మ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి, చంద్రబాబు పాత్రలు పోషించే నటీనటులను వెల్లడించాడు. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన కన్నడ నటి యజ్ఞశెట్టిని లక్ష్మీపార్వతి పాత్రకు, నటుడు శ్రీతేజ్‌ను చంద్రబాబు నాయుడి పాత్రకు ఎంచుకున్నాడు ఆర్జీవి.
యజ్ఞశెట్టి, శ్రీతేజ్‌లు లక్ష్మీపార్వతి, చంద్రబాబు గెటప్స్‌లలో వున్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి, ముఖ్యంగా చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్ ఫొటోలు నాలుగైదు పోస్ట్ చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని.. ఆయన కళ్ళలో ఏదో వుందని తనదైన స్టైల్లో కామెంట్ పెట్టాడు. నటుడు శ్రీతేజ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈమధ్యే ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించాడు.