కోలుకుంటున్న బ్రహ్మానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తనయుడు హీరో గౌతమ్ వెల్లడించాడు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యుల సలహామేరకు శస్తచ్రికిత్స కోసం ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్’లో సోమవారం ఆపరేషన్ చేయంచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చారని తనయుడు గౌతమ్ పేర్కొన్నాడు. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబుచేస్తున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ్‌లు తండ్రితోపాటు ముంబైలో ఉన్నారు.