చార్ల్లీ.. సీక్వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం క్రితం చార్లిచాప్లిన్ టైటిల్‌తో కితకితలు పెట్టిన ప్రభుదేవా -మరోసారి సీక్వెల్‌తో కడుపుబ్బ నవ్వించేందుకు రంగం సిద్ధమైంది. అమ్మా క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న చార్లిచాప్లిన్-2లోనూ ప్రభుదేవాయే హీరో. ప్రభుదేవాతో నిక్కీగల్రానీ, ఆదాశర్మ జోడీ కట్టారు. కీలక పాత్రను నటుడు ప్రభు పోషిస్తున్నాడు. సీక్వెల్‌కు శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తే, సంగీతాన్ని అమ్రీష్ గణేశ్ సమకూర్చాడు. ప్రాజెక్టుపై దర్శకుడు శక్తి మాట్లాడుతూ -పదహారేళ్ల క్రితం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విజయం సాధించిన చార్లిచాప్లిన్ మళ్లీ సీక్వెల్‌గా వస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలామందే ఆసక్తిగా చూస్తున్నారు. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే చిత్రం ఉంటుదని నమ్మకంగా చెబుతున్నా అన్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు ప్రభుదేవా స్టయిల్ డ్యాన్స్‌లతో చిత్రం ఉంటుందని అర్థమవుతోంది. ‘జీవితంలో చేసిన చిన్న పొరబాటు -ఎన్ని అగచాట్లకు దారితీసిందో’నన్న ఇతివృత్తాన్ని ఇందులో చూపించే అవకాశం ఉందని అంటున్నారు.