మళ్లీ.. ఆటాడేస్తాడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్‌శంకర్ (ఆటగదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్(కాగా ముతె్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్.వి.నిర్మల్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నిర్మాత శ్రీ అల్లు అరవింద్, జెమినికిరణ్, శరత్‌మరార్, చంద్రసిద్ధార్థ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని తదితరులు విచ్చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ చిత్రానికి కథ అందించారు. గిఫ్టన్ ఇలియాస్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోద భరితమైన కుటుంబ కథాచిత్రమిదని దర్శకుడు నిర్మల్‌కుమార్ తెలిపారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తవుతుందని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్‌లు తెలిపారు.